స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి విజయాలు తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్ బాహుబలితో ఈ అమ్మడు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత అనుష్క కొద్ది కాలం పాటు సినిమాలకు దూరమైంది. ఇటీవల ఈ అమ్మడు ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఇదిలా ఉంటే.. అనుష్క పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, అనుష్క ఓ 42 ఏళ్ల కన్నడ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా నిజంగానే ఆమె పెళ్లి చేసుకోబోతోందా? అని షాక్ అవుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం వాటిని కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రభాస్‌ను వదిలేసి నిర్మాతను ఎలా వివాహం చేసుకుంటుందని చర్చించుకుంటున్నారు.
ఎట్టకేలకు 42 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్న అనుష్క శెట్టి.. వరుడు ఎవరంటే?
19
Sep