కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్
విజయవాడ (అక్షర ప్రళయం)
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక వివాదాస్పద వ్యాఖ్యలు ప్రచార మాధ్యమాల్లో వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే తిరుపతి లడ్డూ తయారీపై ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల ఆరాధ్యదైవం, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యంగల తిరుమల తిరుపతి లడ్డూపై వివాదాస్పవ వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేయాలన్నారు. లేదా సిబిఐ విచారణ చేయించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ తెలిపారు.