(అక్షర ప్రళయం)
సఫాయిమిత్ర కార్మికుల సంక్షేమం, ఆరోగ్యమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రత్వ శాఖ మంత్రి డా.వీరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన జోన్ 3 లాసన్స్ బే కాలనీ ఎం.ఎస్.ఎఫ్-3 లో జరిగిన కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ తో కలిసి సఫాయిమిత్ర కార్మికులకు జెసిబి వాహనాలు, పిపిఇ కిట్లు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సఫాయిమిత్ర కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సఫాయిమిత్ర కార్మికులు భూగర్భ డ్రైనేజీలో దిగి తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవలసి వస్తుందని అందుకు ఏ ఒక్క సపాయిమిత్ర కార్మికుడు మ్యాన్ హోల్ లో దిగకుండా వారి కొరకు నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో లబ్ధిదారులకు స్వచ్చత ఉజ్వల యోజన పధకం కింద ప్రత్యేకమైన రెండు జెసిబి వాహనాలను, నమస్తే అనే కార్యక్రమం కింద సఫాయిమిత్ర కార్మికులకు పనిముట్లను అందించడం జరిగిందన్నారు.
అనంతరం జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ సఫాయిమిత్ర కార్మికులకు భూగర్భ డ్రైనేజీలో దిగి పని చేయకుండా ప్రత్యేకమైన వాహనాలను జీవీఎంసీ సమకూర్చిందని, ఇప్పటికే జీవీఎంసీ 15 వాహనాలను సఫాయి కార్మికులకు అందించిందని, ఒక్కొక్క వాహనం ఐదు మంది కార్మికులకు గ్రూపుగా కలసి వాహనాలను వినియోగించడం జరుగుతుందన్నారు. ఆ వాహనాల ద్వారా వచ్చిన అద్దె వారి కుటుంబ అవసరలకు ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాన్ని ఒక సంజీవినిలా స్వచ్చ భారత్ మిషన్ రూపోందించిందన్నారు. స్వభావ్ స్వచ్చత, సంస్కార్ స్వచ్ఛత నేపధ్యంగా స్వచ్చతా కీ భాగీదారీ, సంపూర్ణ స్వచ్చత, సఫాయిమిత్ర సురక్షా శిబిరం అనే మూడు ప్రధాన అంశాలతో విశాఖ నగరంలో పరిశుభ్రత చర్యల దిశగా ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. సఫాయిమిత్ర సురక్ష శిబిరాలలో పారిశుద్ద్య కార్మికులకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించడం, వారి సంక్షేమానికి ప్రభుత్వ పధకాలు, భీమా యోజనాలను కల్పించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ నొల్లి నూకరత్న, జోనల్ కమీషనరు-3 శివప్రసాద్, ప్రధాన వైద్యాధికారి డా.నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజినీరు క్రిష్ణారావు, సహాయ వైద్యాధికారి క్రిష్ణం రాజు తదితరులు పాల్గొన్నరు.