డాక్టర్ కందుల నాగరాజు
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
ఆకతాయిల ఆగడాల పై పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపు తామని విశాఖ దక్షిణ నియోజక వర్గం జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు 32వ వార్డులో పలు ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఆక తాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డాక్టర్ కందుల నాగరాజ్ కు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు స్పందించిన ఆయన స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ తిరుమల రావుతో కలిసి చలువతోట ఎల్లపు వారి వీధి ఎస్సార్ఎంటి వెనుక భాగం అలాగే నేరెళ్ల కోనేరు వీధి లలో పర్యటించారు స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసు కున్నారు సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ 32వ వార్డులో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చోటు ఉండదని స్పష్టం చేశారు 32వ వార్డును మోడల్ వార్డుగా రూపుదిద్దేందుకు తాను అహర్నిశలు కృషిచేస్తున్నట్లు చెప్పారు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత తెలిపారు సీఐ తిరు మలరావు మాట్లాడుతూ చట్టాన్ని ఎవరు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు ప్రజలను ఇబ్బందికి గురి చేసే వారిపై చర్యలు తప్పవని చెప్పారు ఈ వార్డులో ఏ సమస్య వచ్చినా డాక్టర్ కందుల నాగరాజు ముందు ఉండి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కందుల కృష్ణ సిపిఐ బుజ్జి,అదిబాబు,నాగేంద్ర, రమేష్ పాడి,గాజుల శ్రీను,చిట్టమ్మ , ప్రేమ్,కుమారి,కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.