కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ శ్రీభరత్,టీడీపీ ఇన్చార్జి సుధాకర్, బిజెపి నేతలు
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
దక్షిణ నియోజకవర్గంలో కేజీహెచ్, టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ లను విశాఖ ఎంపీ శ్రీ భరత్,స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ సౌత్ ఇన్చార్జి సుధాకర్ అన్న క్యాంటీన్ లను ప్రారం భించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కూటమి నేతలతో కలసి పలువురికి స్వయంగా వడ్డించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదలకు రుచికర మైన నాణ్యమైన ఆహారం 5 రూపాయలకు అందించిన గొప్ప విషయమని అన్నారు పేదలకు అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేశామని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి హామీ నెరవేర్చడం జరిగిందనన్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, కూటమి శ్రేణులు,కార్యకర్తలు పాల్గొన్నారు.