విజయవాడ, సెప్టెంబర్ 24 : (అక్షర ప్రళయం)
ఏపీ బీజేపీ చీఫ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి కీలక పదవి దక్కడంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ ఛైర్ పర్సన్‌గా పురంధేశ్వరిని నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీచేయడంపై హర్షం వెలిబుచ్చారు. పురంధేశ్వరి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ జమీల్ అహ్మద్ బేగ్ తెలిపారు.