సీఎం చంద్రబాబును కలిసి సి.ఎం సహాయ నిధికి చెక్కును అందజేసిన పాలకవర్గం సభ్యులు
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరపున వరద బాధితుల సహాయార్థం రూ. కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షుడు పి. వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ డి. గౌర్ విష్ణు తేజ్ లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు. ఏసీఏ నూతన పాలకవర్గం సభ్యులు ఇటీవల కొలువుదీరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వరద బాధితుల సహాయార్థం ఏసీఏ తరపున అధ్యక్షుడు కేశినేని శివనాథ్ సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. వరద బాధిత కుటుంబాల కోసం కొనసాగుతున్న సహాయ, పునరావాస ప్రయత్నాలలో ఈ సహకారం సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు.