విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖ జిల్లా హ్యూమన్ రైట్స్ మిషన్ సంయుక్త కార్యదర్శి అయిన బి.సంతోష్ (34), తాను మరణించినా మరో ముగ్గురికి జీవితాన్నిచ్చిన సంతోష్ స్వస్థలం అనకాపల్లి జిల్లా, రావికమతం మండలం, కొత్తకోట గ్రామానికి చెందిన ఈయన కోవిడ్ తర్వాత నుండి అనారోగ్యంతో తన కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటూ ఇటీవల తనకి కిడ్నీ మార్పిడి నిమిత్తం ఆరోగ్య శ్రీ పథకం క్రింద మంజూరు చేయడం జరిగింది. మరో నెల రోజుల్లో కిడ్నీ మార్పిడి జరగాల్సి ఉంది. ఇంతలో విపరీతమైన తలనొప్పితో ఆదివారం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చేరగా బ్రెయిన్ డెడ్ అని నిర్ధారణ అయిన తర్వాత కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవ దానాలు కొరకు ఆసుపత్రి మేనేజ్మెంట్ నకు వివరించగా వారు తగిన ఏర్పాట్లు చేసి గురువారం సాయంత్రం తన కళ్ళు,లంగ్స్,లివర్ దానం చేశారు. అతని ఊపిరి తిత్తులు గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ కు విమానం లో తరలించారు. కాలేయం, కళ్ళు సీనియార్టీ ప్రకారం (జీవన్ దాన్ ) ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేశారు.రాష్ట్ర జీవన్ దాన్ కోఆర్డినేటర్ రాంబాబు పర్యవేక్షణలో జరిగింది.