విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
దేవీ నవరాత్రులను పురస్కరించుకొని 29వ వార్డు పరిధిలో ఆంథోనీ నగర్లో వెలసిన అమ్మవారి విగ్రహం వద్ద శుక్రవారం గొప్ప అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి 29వ వార్డు టిడిపి అధ్యక్షులు ఉరుకుటి గణేష్ ని ముఖ్య అతిథి గా ఆహ్వానించడం జరిగింది, కమిటీ వారి ఆహ్వానం మేరకు 29 వార్డు తెలుగుదేశం అధ్యక్షులు ఉరుకుటి గణేష్ విచ్చేసి అన్నప్రసాదాన్ని భక్తులకు వడ్డించారు, వారితో పాటు వార్డ్ జనరల్ సెక్రటరీ రాయన బంగారురాజు, దలై కిషోర్, బండి అప్పలరాజు, కదూరి హేమలత, కొండ్రు శ్రీను, పడాల శ్రీను పాల్గొన్నారు.