డిపాజిట్ దార్ల నెత్తిన కుచ్చుశటోపి పెట్టిన వైనం.
సీఐడీ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం..
చిలకలూరిపేట (అక్షర ప్రళయం)
ఇల్లు అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన వాళ్లు కొంతమంది, కొడుకులు పంపించిన డబ్బులు దాచుకున్న వారు మరికొందరు, బంగారం తనఖా పెట్టి రుణం తెచ్చుకున్న వారు ఇంకొంతమంది..
వ్యాపారం కోసం ఓడీలకు వెళ్లిన వారు మరి కొంతమంది.. వీరందరినీ మోసం చేసింది మాత్రం ఇద్దరూ ఉద్యోగులు.. ఇప్పటి వరకూ రెండు బ్రాంచ్‌ల్లో మోసం చేసిన వారు దొరికిపోయారు. చివరకు వారు చేసిన పాపాల పుట్ట పగిలిపోయింది. దీంతో ప్రభుత్వం పూర్థి స్థాయి దర్యాప్తు కోసం సీఐడీకి కేసును అప్పగించింది.అతని పేరు నరేష్ ఐసీఐసీఐ చిలకలూరిపేట బ్రాంచ్ మేనేజర్.. మరొక అతను పేరు హరీష్ బ్యాంక్‌లో అప్రైజర్‌గా పనిచేస్తాడు. ఇద్దరూ కలిసి చేతులు కలిపారు. ఇంకేముంది తమకిష్టమొచ్చినట్లు మోసాలకు పాల్పడ్డారు. యడ్లపాడుకు చెందిన ఓ మహిళ తన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులను చిలకలూరిపేటలోని ఐసీఐసీఐ బ్రాంచ్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. అయితే కొద్దీ రోజుల తర్వాత ఆమె బ్యాంక్‌కు వచ్చి ఆరా తీయగా ఆమె డిపాజిటే లేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె కంగుతింది. మరికొంత మంది తాము తీసుకున్న రుణం కంటే తమ పేరుపై అధిక రుణం ఉన్నట్లు గుర్తించారు.