మాడుగుల,అక్షర ప్రళయం
దసరా నవరాత్రులు సందర్భంగా శనివారం విజయదశమి వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాడుగులలో గల శ్రీ దుర్గా దేవి, దుర్గాలమ్మ అమ్మవారు ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో పెద్ద ఎత్తున విద్యుత్ కరణ చేపట్టారు. దసరా సందర్భంగా గ్రామంలో పలుచోట్ల సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయం వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అలాగే మాడుగుల గల శ్రీ పోలి పిల్లమ్మ ఆలయం వద్ద, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద కూడా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మాడుగుల మండలం కేజే పురం జంక్షన్ లో గల వెంకటేశ్వర స్వామి వాసవి మాత ఆలయాల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఎం కోడూరు తదితర గ్రామాల్లో కూడా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.