కుత్బుల్లాపూర్( తెలంగాణా) అక్షర ప్రళయం
కుత్బుల్లాపుర్ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఆఖరి రోజు శనివారం దసరా సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో 50 అడుగుల రావణాసురుడి కటౌట్ దహనం ఆకర్షణ. వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ నవరాత్రి ఉత్సవాలు ఆలయంలో ఏర్పాటు చేశారు. దుర్గాదేవి కొలువు ఏర్పాటుచేసి తొమ్మిది రోజులు వేడుకలు జరిపారు.దసరా నేపథ్యంలో చివరి రోజు అమ్మవారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.మహిషాసురుని వధించడం వల్ల దుర్గాదేవికి మహిషాసురామర్ధిని అని పిలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం 50 అడుగుల రావణా బ్రహ్మ కటౌట్ ఏర్పాటుచేసి దహనం చేశారు. రావణాసురుడు కటౌట్ మొత్తం బాణాసంచాతో ఏర్పాటు చేశారు. రావణుడు కట్ అవుటర్ కు నిప్పు అంటించగానే మెడిమిట్ల గొలుపే కాంతులతో భారీ పేలుళ్లు జరిగేయి. పేలుళ్లకు జనం అదిరిపోయారు. చిన్నారుల నృత్యాలు హకర్షణీయమైన విద్యుత్ కాంతులు బాణాసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణ. నవ రాత్రి వేడుకలు తిలకించేందుకు భారీ ఎత్తున జనం తరలి రావడంతో తోపులాటలు జరిగేయి. పిల్లలు పెద్దలు తోపులాటలో ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు పెద్దగా స్పందించలేదు.