అమలాపురం (అక్షర ప్రళయం)
పురోహితులు వేద మంత్ర పఠనంలోనే కాదు, యుద్ధ విధ్యలోనూ ఆరితేరిన వారుంటారని నిరూపించారు ఓ పురోహితుడు. ఆయన మంత్రం పఠిస్తే దిక్పాలకులు మంత్రముగ్ధం… ఆయన కత్తి పడితే కరాళ నృత్యం…
అమలాపురం టౌన్ పోలీసుస్టేషన్ లో నిర్వహించిన ఆయుధపూజలో వేదపురోహితుడు ఉపద్రష్ఠ విజయాదిత్య చేసిన కత్తి యుద్ద విన్యాసం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. విజయ దశమి శుభసందర్భంగా పోలిస్ స్టేషన్ లో అమలాపురం టౌన్ సిఐ వీరబాబు సమక్షంలో ఆయన శాస్త్రోక్తంగా ఆయుద పూజ చేసి, అనంతరం కత్తి యుద్ధ విన్యాసం చేశారు.