తస్మత్ జాగ్రత్త లీటర్ నీటిలో 3లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు.
సెంట్రల్ డెస్క్ (అక్షర ప్రళయం)
ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిళ్ల నమ్మకం జరుగుతున్నట్లు అంచనాలు చెపుతున్నాయి.శ్రేష్ఠమైన నీరు తాగాలన్న తపనతో ప్రతీ ఒక్కరు అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు.వాటర్ బాటిల్స్ నిత్యావసర మైంది. హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తే వాటర్ బాటిల్. ఫంక్షన్లలో భోజనం చేస్తే వాటర్ బాటిల్. ప్రయాణాల్లో దాహం వేస్తే వాటర్ బాటిల్. ఇలా ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి పది లక్షలకుపైగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. సమృద్ధిగా నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటామనే భావనతో రోజువారీ జీవితంలో ఎడాపెడా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కొనేసి ఉపయోగిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ వాటర్ బాటిల్ తాగడం వల్ల శరీరంలోకి చెడు రసాయానాలు బాటిల్స్ వల్ల భూమిలో ఓజోన్ పొరకు నష్టం జరుగుతుందని నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు.లీటర్ నీటిలో మూడు లక్షల మైక్రో ప్లాస్టిక్ కణాలు బిస్ ఫెనాల్స్ ఏ హానికర రసాయనాలు విడుదల అవుతాయి.