సెంట్రల్ డెస్క్ (అక్షర ప్రళయం)
ప్లాస్టిక్ బాటిల్ నీటిలోకి మైక్రో ప్లాస్టిక్‌లు, బీపీఏ (బిస్‌ఫెనాల్–ఏ) తదితర హానికర రసాయనాలు విడుదలవుతుంటాయి. ఒక లీటర్ వాటర్ బాటిల్‌లో లక్ష నుంచి మూడు లక్షల వరకు మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తేలింది. ఇందులో 90 శాతం నానో ప్లాస్టిక్ కణాలే. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. పునరుత్పత్తి హార్మోన్లు, థైరాయిడ్ హార్మోన్లు, రోగ నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నివేదిక తెలిపింది. రక్తపోటు, గుండె, మధుమేహం, ఊబకాయంతో పాటు మానవ అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయట.