ముంబాయి సెంట్రల్ డెస్క్ (అక్షర ప్రళయం)
ముంబై నగరం నెత్తురు పారింది.నగరం నడిబొడ్డున
సీనియర్ ఎన్సీపీ నేత (అజిత్ పవర్ వర్గం)మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ తుఫాకీ తూటలకు బలైపోయారు.బాంద్రా ప్రాంతంలో శనివారం రాత్రి తొమ్మిది గంటల 20 నిమిషాలు నుంచి తొమ్మిది గంటల 30 నిమిషాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు.తూటలకు బలైన సిద్దిఖీని
చికిత్స నిమిత్తం లీలావతి ఆసుపత్రికి తరలించారు.అయితే బుల్లెట్లు దాడిలో సిద్ధిఖీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
నిందితులు టపాసులు పేల్చి గందరగోళం సృష్టించి, తర్వాత బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపారు.
ఆయన కడుపు, ఛాతీకి లోకి ఆరు బుల్లెట్లు దూరాయి
ఈ ఘటనలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దాడికి పాల్పడిన వారు
హర్యానా ఉత్తరప్రదేశ్ కు చెందిన వారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే చెప్పారు.సిద్ధిఖీ కుమారుడు ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.