- డాక్టర్ సుంకరి రామకృష్ణారావు. విశ్రాంత ఉపకులపతి. కృష్ణా యూనివర్సిటీ..
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టు నాటి పెంచండి పూజించండి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి డాక్టర్ సుంకరి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం సీతమ్మ ధారలోని జివిఎంసి పార్క్ లో జమ్మి చెట్టు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు.
తులసి , ఉసిరి , మారేడు , వేప , మోదుగ, రావి , జమ్మి వంటి ఆయుర్వేద గుణాలు గల చెట్లని మనం దేవతా వృక్షాలుగా పూజిస్తామన్నారు.
ఆయుర్వేద మందులలో జమ్మిచెట్టు ఆకు, పువ్వులు, విత్తనాలు, చెట్టు బెరడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు విశ్లేషిస్తున్నారు అని పేర్కొన్నారు. అందుకే ఈ చెట్టుకు సురభి బంగారం అనే పేరు వచ్చింది అన్నారు. పంచ బిళ్వాష్టకాలలో జమ్మి ఒకటి అని వివరించారు.