- ఈస్ట్ కోస్ట్ జనరల్ మేనేజర్ పంక్వల్ పరమేశ్వరన్
- సానుకూలంగా స్పందించిన జనరల్ మేనేజర్ కు కృతజ్ఞతలు.
- ఇంటాక్ శ్రీకాకుళం ప్రతినిధి బృందం
శ్రీకాకుళం రూరల్ (అక్షర ప్రళయం)
ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పంక్వల్ పరమేశ్వరన్ బుధవారం దూసి రైలు నిలయాన్ని సందర్శించిన సందర్భంగా వావిలపల్లి జగన్నాధ నాయుడు, అదనపు కన్వీనర్ భారత జాతీయ కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్ధ (ఇంటాక్) శ్రీకాకుళం విభాగం, కొమ్ము రమణ మూర్తి, పొన్నాడ రవికుమార్, సీనియర్ సభ్యులు, ఇంటాక్ ఆయనను కలసి దూసి రైల్వే స్టేషన్ కు 1942 జూన్ ఆరవ తేదీన గాంధీజీ సందర్శించిన విషయాన్ని తెలియజేసారు. అలాగే మహాత్మ గాంధీ నాటిన మొక్క, వృక్షముగా మారిన వైనాన్ని వివరించారు,అదే రోజు జరిగిన సభలో మహాత్మ గాంధీ ప్రసంగించిన స్థలాన్ని చూపించారు. దూసి రైలు నిలయంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని స్థాపించాలని, వారి పర్యటన వివరాలతో శిలాఫలకాన్ని , అలాగే ఆయన ప్రసంగించిన స్థలం, రెండెకరాలలో క్విట్ ఇండియా ఉద్యమ స్మృతి వనాన్ని ఏర్పాటు చెయ్యాలని, ప్రతిపాదనలు చేశారు. సానుకూలంగా స్పందించిన పంక్వల్, విశాఖపట్నంలో ఈ ప్రతిపాదన పరిశీలించామని, త్వరలో ప్రతిపాదనలపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో విశాఖపట్నం డిఆర్ఎం సౌరబ్ ప్రసాద్, ఈస్ట్ కోస్ట్ రైల్వే బృందంతోపాటు, స్థానిక అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.