విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖ నగర ఎయిర్ పోర్టు నందు ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్.నగర ప్రజల నుండి సిపి ఇచ్చిన ఫోన్ నంబరు 7995095799 కు అందిన విన్నతుల మేరకు మరియు ప్రయాణికులు సురక్షితముగా విమానాశ్రయం నుండి వారి గమ్యం స్థానం చేరేందుకు గానూ ఈ ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగినది.ఈ ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ నందు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కాబడిన అసోసిషన్ ను నందు సభ్యులగు డ్రైవర్ లను నియమించడంతో పాటుగా సదరు టాక్సీ డ్రైవర్ మరియు యాజమానుల వివరాలు పూర్తి పోలీసు వెరిఫికేషన్ చేయబడ్డాయి, అదేవిధముగా ప్రయాణికులు వారి గమ్య స్థానం చేరేవరకు ఈ జి.పి.ఎస్ ద్వారా ఎయిర్ పోర్టు వద్ద గల పోలీసు వారి ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ నుండి పర్యవేక్షణ చేయబడుతుంది.ప్రయాణికుల శ్రేయస్సు మరియు నగరంలో నేరాల నియంత్రణలో భాగముగా సిపి ఎయిర్ పోర్టు అధికారులు మరియు ఇతర అధికారుల సమన్వయం తో ఏర్పాటు చేసిన ఈ ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ పట్ల ప్రజలు తమ హర్షం తెలియజేశారు.