లంబాడీలకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలి..!

లావుడియా రాజు నాయక్ డిమాండ్

హనుమకొండ (అక్షర ప్రళయం)

లంబాడీలకు వెంటనే మంత్రి వర్గంలో చోటు ఇవ్వాలి అని లావుడియా రాజు నాయక్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా నుండి లంబాడీ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 9 నెలలు గడిచిన ఇంతవరకు మా లంబాడీలకు మంత్రి పదవి కేటాయించక పోవడం సరికాదని లంబాడీల లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ మరియు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బానోతు రవీందర్ నాయక్ జిల్లా ఇన్చార్జి భూక్య మోహన్ నాయక్ యూత్ వింగ్ ఇన్చార్జి తిరుపతి నాయక్ జిల్లా కోఆర్డినేటర్ అజ్మీర వెంకటేష్ నాయక్ మొదలైన జిల్లా నాయకులు పాల్గొని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ మాట్లాడుతూ ఒక ప్రకటనలో అసహనం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మా లంబాడీలు కీలక పాత్ర పోషించారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 12% మంది గిరిజనులు ఉన్నారని ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించకపోవడం బాధాకరమన్నారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విస్తరించే క్యాబినెట్లో నైనా మా లంబాడీలకు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని అలా ప్రకటించాలని ఎడల మా లంబాడీలంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెపుతామని హక్కుల కొరకు రాష్ట్రవ్యాప్తంగా తప్పకుండా పోరాటం చేస్తామని లంబాడీల లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *