విశాఖపట్నం (అక్షర ప్రళయం)
రాష్ట్ర, కేంద్రం పెన్షన్ను పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొన్నట్లయితే, వినియోగదారు ఫిర్యాదును ఫైల్ చేసే హక్కు మీకు ఉందని కాప్కో రాష్ట్ర చైర్మన్ దాసరి ఇమ్మ్యూనల్, ప్రధాన కార్యదర్శి హెచ్ ఎస్ రామకృష్ణ పత్రిక ప్రకటన లో వివరాలు తెలిపారు ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఉద్యోగి తన పెన్షన్ పొందడంలో మూడేళ్ల జాప్యాన్ని ఎదుర్కొన్న కేసు లో పెన్షనర్ కూడా వినియోగదారుడు కింద వస్తాడు అన్ని నేషనల్ కన్స్యూమర్ కమిషన్ కోర్ట్ తీర్పు లో పేరుకొందని తెలిపారు. నేషనల్ కన్స్యూమర్ కమీషన్ ఉద్యోగికి అనుకూలంగా తీర్పునిచ్చింది, నేషనల్ కన్స్యూమర్ వివాదాల పరిష్కార కమిషన్న్యూఢిల్లీ రివిజన్ పిటిషన్ నం. 983 ఆఫ్ 2022 పెన్షన్ కంట్రిబ్యూషన్లను చెల్లుబాటు అయ్యే పరిగణనగా గుర్తిస్తూ, ఫిర్యాదును నిర్వహించేలా చేసింది. పింఛను పొందడంలో జాప్యం జరిగినట్లయితే పెన్షనర్లు వినియోగదారుల ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. జాతీయ కమిషన్ పెన్షన్ ఉద్యోగులను “వినియోగదారులు”గా అర్హత కలిగి ఉన్నాయని పేరుకొంది.