ప్రభుత్వ సిబ్బంది తో నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
దక్షిణ నియోజకవర్గం పరిధిలో గల 38వ వార్డులో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. వార్డులో ముఖ్యంగా అమ్మవారి దేవాలయానికి వెళ్లే రోడ్డు విస్తరించాల ను, విక్టోరియా ఆసుపత్రి ఆవరణలో అదరపు భవనం నిర్మాణం తక్షణం చేపట్టాలని , పాత తాలూకా ఆఫీసు , మున్సిపల్ ఆఫీసు టౌన్ హాల్ ఆధునికరించి వినియోగంలోకి తీసుకురావాలని , వార్డులో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క క్వార్టర్స్ శిథిలావస్థలో వున్నందున కొత్త నిర్మాణం చెప్పటాలని, అండర్ డ్రైనేజీ , కేబుల్ , సామాజిక భవనములు, నీటి సరఫరా, డ్రైనేజీ, వంటి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ రానున్న రోజులలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే వంశీ కి జన నీరాజనాలు పలికారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు జనసేన సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ, స్థానిక కార్పొరేటర్ నరసింహాచారి , స్థానిక కూటమి నేతలు మాజీ కార్పొరేటర్ ఉమ , జి కె , పెద్దలు సత్యనారాయణ , త్రినాధ్ వార్డ్ అధ్యక్షులు అరుణ్, హరి, శ్రీకాంత్, శ్రావణి, బ్రమ్మాజీ, శ్రీనివాస్ , రామారావు , తాతాజీ , నాయుడు, పలువురు నాయకులు , ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.