రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక
కైలాసగిరి అక్టోబర్ 18:(అక్షర ప్రళయం)
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు – 2024 కార్యక్రమం లో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఐపిఎస్ కైలాసగిరి, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయం వద్ద ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ సెంటర్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ప్రారంభోత్సవం చేశారు.ఈ శిబిరానికి సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పార్టీ పోలీసులు మరియు హోంగార్డులు స్వచ్ఛందంగా వచ్చి సుమారు 65 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం చేసిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న అందరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది రక్తదానం చేసి ప్రమాదాల్లో గాయాలు పాలైన వ్యక్తుల ప్రాణాలు రక్షించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్ రావు, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కే.వీ.సత్యనారాయణ, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీ పి.నాగేశ్వరరావు, ఇనస్పెక్టర్ లు చంద్రశేఖర్, బాల సూర్యారావు, మన్మధరావు, సతీష్, నరసింహమూర్తి, సంజీవరావు అనకాపల్లి రూరల్ ఎస్సై వి.సత్యనారాయణ, ఏ.అర్ ఎస్సై ఆదినారాయణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ సెంటర్ డాక్టర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో వారి ఇబ్బంది పాల్గొన్నారు.