హనుమకొండ (అక్షర ప్రళయం)
హనుమకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి కి పోలీసు శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు ఇచ్చే అతి ఉత్కృష్ట సేవా పథకం అవార్డు లభించిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది. నిరంతరం పేద ప్రజలకు జరుగుతున్న నష్టాలపై,ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదును సత్వర న్యాయం చేస్తూ ఉన్నత పోలీసు అధికారిగా నిరంతరం పాటుపడుతున్న దేవేందర్ రెడ్డి కి భవిష్యత్తు లో మరిన్ని ఉన్నతమైన సేవ పథకాలు లభించి పోలీసు శాఖలో మంచి గుర్తింపు పొందాలని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గుగులోత్ రాజునాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రాథోడ్, 56 డివిజన్ సేవాలాల్ గోర్ బంజారా సంక్షేమ సంఘం నాయకులు,సహకార సంఘ కళాశాల ప్రిన్సిపల్ యాకూబ్ నాయక్, ఎల్ఐసి డి.ఓ వీరు నాయక్, ట్రాన్స్కో ఏడి భోజ్యనాయక్, నాయక్ కార్ వాష్ & డెకర్స్ అధినేత బోడ నరసింహ నాయక్, కరణ్ నాయక్, రాంనగర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.