హాల్ నిర్మాణం లో భాగమైన సిబ్బందిని సత్కరించి అభినందించిన సి.పి డా.శంఖబ్రాత బాగ్చి
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖ నగర ఆర్ముడ్ రిజర్వ్ ఆవరణలో పోలీస్ మెన్స్ వెయిటింగ్ .హాల్ ను ప్రారంభించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్.,సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే సిపి తాను ఇచ్చిన ఫోన్ నంబరు 7995095799 కు అందిన వినతుల మేరకు పోలీస్ మెన్స్ వెయిటింగ్ హాల్ నిర్మాణం త్వరితగతిన చేపట్టి, శనివారం ప్రారంభించడం జరిగినది.పోలీస్ మెన్స్ వెయిటింగ్ హాల్ పరిసరాలు మొత్తం పరిశీలించిన సిపి పరిసరాలను కూడా పరిశభ్రంగా ఉంచాలని , సీసీటీవీకెమెరాలను ఏర్పాటు చేయాలనీ, లైటింగ్ పెంచాలని అధికారులను ఆదేశించారు, అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి నూతనముగా ప్రారంభించిన హాల్ నందు సిబ్బందితో సమావేశమయ్యారు, ఈ సందర్భముగా ఇద్దరు సిబ్బంది మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అందుబాటులో లేని పోలీస్ మెన్స్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు పట్ల తమ సంతోషం వ్యక్తం చేశారు, విధుల కోసం వేచి ఉండే సమయంలో ఈ హాల్ నందు విశ్రాంతి తీసుకొంటూ మరింత సమర్ధవంతముగా విధులు నిర్వహించుటకు సదరు హాల్ మాకు ఎంతో తోడ్పడుతుందని అందుకు సీపీ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు అని తెలిపారు.
అనంతరం సిపి గారు మాట్లాడుతూ సిబ్బంది నుండీ వచ్చిన అభ్యర్థన మేరకు ఈ హాల్ సిద్ధం చేయాలనీ ఆలోచన వచ్చినదని, మీరు తాను ఇచ్చిన 7995095799 నెంబరుకు ఇతర అవసరమైన సదుపాయాలు కోసం తెలుపవచ్చని తెలిపారు, సిబ్బంది కి అవసరమైనప్పుడు వారి సెలవులు వారికి ఇవ్వాలని, నేను నగర అధికారులు అందరికీ అడిగినప్పుడు సెలవులు ఇస్తున్నానని అదేవిధముగా మీకు కూడా వారు సెలవులు ఇవ్వాలని, తమకు అర్హత ఉన్న సెలవలులో ఎవరికైనా అవసరమైనప్పుడు సెలవు ఇవ్వక పోతే తమకు తెలియజేయమని తెలిపారు, అదేవిధముగా వయస్సు ఎక్కువగా ఉన్న వారికి హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలో విధులు వేయాలని, తక్కువ వయస్సు గల వారికి బందోబస్తు విధులు వేయాలని, హోం గార్డులకు యెటువంటి ట్రావెలింగ్ ఎలావెన్సులు లేనందున వీలైనంతవరకు వారి ఇళ్లకు దగ్గరలో విధులు వేయాలని తెలిపారు, సిబ్బంది అందరూ మూడు విషయాలు పాటించాలని మొదటిది ఆరోగ్యం అనీ, ఎల్లవేళలా ఆరోగ్యం సంరక్షించుకోవాలనీ రెండవది కుటుంబం అని, తగినంత సమయం కుటుంబానికి కేటాయించాలని, మూడవది విధులు అనీ, విధులలో ఉన్నంత వరకూ సమర్ధవంతముగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ నూతన పోలీస్ మెన్స్ వెయిటింగ్ హాల్ నందు ఏ.సి, ఫ్యాన్లు, టి.వి లను సక్రమముగా వినియోగిస్తూ విద్యుత్తును ఆదా చేయాలనీ, హాల్ ను సక్రమముగా నిర్వహించేందుకు కొందరిని నియమిస్తున్నామని తెలిపారు. అనంతరం హాల్ నిర్మాణం లో భాగమైన సిబ్బందిని సత్కరించి అభినందించారు.