బాధ్యులైన సీఐ, ఎస్సై లపై చర్య తీసుకోవాలి..!
లంబాడా లైవ్ ఐక్యవేదిక నాయకుల డిమాండ్
జనగామ (అక్షర ప్రళయం)
పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఘటనపై న్యాయ విచారణ జరిపించి బాధ్యులైన సీఐ, ఎస్సై లపై చర్య తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి సర్వీస్ నుండి డిస్మిస్ చేయాలని. లంబాడా లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు బానోతు రవీందర్ నాయక్ డిమాండ్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో భార్య భర్తలు గొడవలతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లాకావత్ శ్రీను. శుక్రవారం నాడు పోలీస్ స్టేషన్ లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనకు కారుకులైన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాకాంతరావు. స్థానిక ఎమ్మెల్యేతో పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి. స్థానిక సిఐ మహేందర్ రెడ్డి. ఎస్సై సాయి ప్రసన్న. అతనిపై చేయి చేసుకోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీనికి కారుకునులైన. యాకాంతరావు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ కేసు నమోదు చేసి. సీఐ, ఎస్ఐ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని సర్వీసు నుండి డిస్మిస్ చేయాలని. ఆత్మహత్య చేసుకున్న లాకావత్ శ్రీను కుటుంబానికి న్యాయం చేసి. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని లంబాడి లైవ్ ఐక్యవేదిక స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బానోత్ రవీందర్ నాయక్ లంబాడి లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ లావుడియా రాజు నాయక్ జిల్లా ఇన్చార్జి మోహన్ నాయక్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేష్ నాయక్ యూత్ వింగ్ ఇన్చార్జి తిరుపతి నాయక్ సుమన్ నాయక్ మొదలైన నాయకులు డిమాండ్ చేయడం జరిగింది.