విశాఖపట్నం (అక్షర ప్రళయం)
వైజాగ్ బీట్స్ వార్షికోత్సవం సందర్భంగా మెగా మ్యూజిక్ ఈవెంట్ ను నగరంలోని గాదె రాజు ప్యాలెస్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సినీ దర్శకులు పీ సీ ఆదిత్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ బీట్స్ సింగర్ లు అద్భుతంగా పాడుతున్నారన్నారు. తాను తీయబోయే కొత్త సినిమా లో ఇలాంటి వారికి పాడే అవకాశం తో పాటు నటులుగా ను ఎంపిక చేస్తామన్నారు. డిజైర్ సొసైటీ హెచ్ ఐ వి బాలల సంరక్షణ సంస్థ కు వైజాగ్ బీట్స్ తరపున రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. సాయింత్రం జరిగిన ముగింపు వేడుకకి గాయకులు గజల్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు . గానం దేవుడిచ్చిన ఒక గొప్ప వరమన్నారు. కళా నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు కొకొ ల్లలన్నారు. విశాఖ నగరానికి చెందిన మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడి చేస్తున్న సంగీత, సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం అని తెలిపారు. అనంతరం వైజాగ్ బీట్స్ సింగర్లకు అతిథులు చేతులు మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ బీట్స్ వ్యవస్థాపకురాలు డి. శారద, తదితరులు పాల్గొన్నారు.