39 వ వార్డు అన్న ప్రసాద వితరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 39వార్డు చిలకపేట, లక్ష్మీ టాకీస్ యువకులు, మహిళలు ఏర్పాటు చేసిన మహా అన్నదానంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ హాజరై భక్తులకు ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలన్నారు.
భగవంతునికి భక్తులకి సేవ చేయడం ఆత్మసంతృప్తినిస్తుందన్నారు. నిర్వాహకులు శ్రీ దుర్గా అమ్మవారికి నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు. వారికి తన వంతు సాయంగా ఈ అన్నదానానికి రూ.15,000లు విరాళం అందజేశామని చెప్పారు. శ్రీ దుర్గా దేవి అమ్మవారి కరుణాకటాక్షంతో ప్రజలందరికీ చేసే ప్రతి పనిలో విజయం సిద్ధించాలని ఆకాంక్షించారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలకు కష్టాల నుండి గట్టెక్కాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలని, మళ్లీ రామరాజ్యం అమ్మవారి కృపతో వస్తుందని వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ముజీబ్ ఖాన్ మరియు కమిటీ సభ్యులు ఆదినారాయణ,ఆదిలక్ష్మి రాజేష్ , ధనరాజు, అప్పలరాజు, గంగిరి నూకరాజు, వైసిపి నాయకులు గనగళ్ల రామరాజు, ఆకుల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.