విశాఖపట్నం (అక్షర ప్రళయం)
జాతీయ స్టాయి కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటిల నందు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి మరియు విద్యార్ధుల ప్రతిభ గుర్తించిన జి నూకరాజు, హోంగార్డ్ ను అభినందించిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్..విశాఖపట్నం సిటీ హోంగార్డ్స్ యూనిట్ నందు పనిచేస్తూ కిక్ బాక్సింగ్ నందు ఆసక్తి ఉన్న విద్యార్ధులను ప్రోత్సహిస్తూ సెప్టెంబర్ నెలలో, డెహ్రాడున్, ఉత్తరాఖండ్ నందు జరిగిన 17 సీనియర్, 16 జూనియర్ మరియు 15 సబ్ జూనియర్, జాతీయ స్టాయి కిక్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటిలనందు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి మరియు వారి యొక్క విద్యార్ధుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరపున 02 వ స్టానం కైవసం చేసుకోవడం జరిగినది.బుధవారం జి నూకరాజు, హోంగార్డ్-820 వారిని కమీషనర్ అఫ్ పోలీస్, విశాఖపట్నం సిటీ వారు తమ కార్యాలయం నందు అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజర్వు ఇన్స్పెక్టర్ హోంగార్డ్స్, విశాఖపట్నం సిటీ వారు పాల్గొన్నారు.