హోం గార్డ్ సతీమణి కి కారుణ్య నియామకం క్రింద హోం గార్డ్ ఉద్యోగం..!
నియామక పత్రం అందజేసిన సి.పి
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
అకాల మరణం చెందిన హోం గార్డ్ కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు మరణించిన హోం గార్డ్ యొక్క సతీమణి కి కారుణ్య నియామకం క్రింద హోం గార్డ్ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రాత బాగ్చి, ఐ.పి.ఎస్.నగర పోలీసు శాఖ నందు హోమ్ గార్డుగా విధులు నిర్వర్తించిన మహమ్మద్ హాసం (46)(హెచ్.జి-326) న్యూరో సమస్యలతో తో ఆగస్టు 15 న(2024)
అకాల మరణం చెందారు. కాంట్రిబ్యూషన్ ఫండ్ నుండి సదరు హోం గార్డ్ భార్యకు ఆర్థిక సహాయం చెక్ రూపంలో ఈ రోజు సిపి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగినది. మరణించిన హోమ్ గార్డు భార్య జరీనా కౌషర్ కి కారుణ్య నియామకం క్రింద హోమ్ గార్డు ఉద్యోగం నియామక పత్రం బుధవారం నగర పోలీసు కమిషనర్ కార్యాలయం లో సిపి చేతుల మీదుగా అందజేయడం జరిగినది.