విశాఖపట్నం (అక్షర ప్రళయం)
నగరంలో మహారాణి పేట ట్రాఫిక్ పోలీసు స్టేషనుకు చెందిన ఒక ఎస్.ఐ మరియు హోం గార్డు, రెండవ పట్టణ ట్రాఫిక్ పోలీసు స్టేషనుకు చెందిన ఒక ఎస్.ఐ మరియు హోం గార్డు , ఈ నెల 17 వ తేదీన బీచ్ రోడ్ లోని ఒక ప్రముఖ హోటల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్/రైడర్ల ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని బెదిరించి ఒక ఆటో డ్రైవర్ సహాయంతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని సిపి దృష్టికి రావడం జరిగినది.
పోలీసు కమీషనర్ పై సంఘటన పై తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణ జరిపి ఎం.ఆర్ పేట ట్రాఫిక్ ఎస్.ఐ ఎం.ప్రసాద్..!రెండవ పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ షేక్ నజరుద్దీన్.! లనూ , హోం గార్డులు ఆర్.వెంకట త్రినాధ్..!, సి.హెచ్ శివ గణేష్..! లను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేశారు.
నగర పోలీసు శాఖ లో పని చేయు అధికారులు మరియు సిబ్బంది పూర్తి పారదర్శకముగా తమ విధులు నిర్వర్తించాలని, విధులలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ తెలిపారు.నగర పోలీసు శాఖలో ఎవరైనా లంచం అడిగినా , తీసుకున్నా వెంటనే సిపి ఇచ్చిన 7995095799 నంబరుకు తెలియజేయమని, వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుందనీ సిపి తెలియజేశారు.