విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
విశాఖ 1టౌన్ నూతన సిఐ గా జి.డి.బాబు శుక్రవారం
బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ కు చేరుకున్న సి.ఐ కి స్టేషన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
గతంలో ఇక్కడ పనిచేశానని అన్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను కాపాడుతానన్నారు.గంజా బ్యాచ్, రౌడీ షీటర్ లపై, దొంగతనాలు, చేసే వారి పై ప్రత్యేక నిఘా వుంటుంది అని అన్నారు. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించేవారి సమాచారం తనకు అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.మన్యం జిల్లాలో విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చినట్లు తెలిపారు.