ఎంపీ శ్రీభరత్..
కంచరపాలెం ఐటిఐ లో కౌశల్ దీక్షాంత సమరోహ్ లో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్..
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
కంచరపాలెం ఐటిఐ లో దేశ వ్యాప్తంగా జరుగుతోన్న కౌశల్ దీక్షాంత సమారోహ్ (స్కిల్ కాన్వొకేషన్) కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు గండి బాబ్జీ,దువ్వారపు రామా రావు కూడా హాజరయ్యారు. ఈ ఐటిఐ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులు న్యూఢిల్లీకి కౌశల్ భవన్‌లో సత్కారానికి ఆహ్వానించబడ్డారు. వారి తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, “కంచరపాలెం ఐటిఐ లో 1000 మందికి పైగా యువత 20కి పైగా ట్రేడ్లలో శిక్షణ పొందడం ఎంతో గర్వకారణం. మెకానిక్ (మోటార్ వెహికల్), వెల్డింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, స్టెనోగ్రఫీ వంటి వివిధ రంగాల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం వల్ల, యువత భవిష్యత్తులో మరింత బలంగా నిలుస్తారని నమ్మకం ఉంది. విద్యార్థులు సంపాదించిన నైపుణ్యాలు మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ఉండటం చాలా అవసరం. విద్యార్థులకు అంకితభావం ఉంటే, వారు నిరంతర ప్రయత్నాలతో విజయం సాధించగలరు,” అని ప్రోత్సహించారు.
ఐటిఐ లు నైపుణ్య గ్యాప్‌ను తగ్గించి, యువతను వాస్తవ ప్రపంచంలో విజయం సాధించేలా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాలి. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారుల వాతావరణం నైపుణ్యాలపై డిమాండ్‌ను పెంచుతోందని, ఈ నేపథ్యంలో ఐటిఐ ల నుండి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని ఎంపీ శ్రీభరత్ తెలిపారు.