వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగకుండా చూడాలి..!
సి.ఐ జి.డి.బాబు…
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా పోలీసులు అందరితో సి.ఐ.జి.డి .బాబు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిఐ మహిళా పోలీసులతో మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి నేరాలు జరగకూడదని, గంజాయి మత్తు పదార్థాలను సేవించే వారి యొక్క మరియు , బెల్ట్ షాప్స్ ను నిర్వహించే వారి యొక్క వివరాలను, మత్తు పదార్థాలు ను, చాలామంది యువకులు సేవించి నేరాలు చేస్తున్నారని కాబట్టి, అసాంఘిక శక్తులు యొక్క వివరాలను సేకరించాలని, ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగించేటట్లుగా ఉన్నట్లయితే అట్టి వారి యొక్క సమాచారాన్ని తెలియజేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎటువంటి నేరాలు జరగకుండా, ముందస్తు సమాచారం సేకరణ చేయాలని తగిన సహాయ సహకారాలు ను, అందించాలని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ తెలియజేయడం జరిగింది.