పలు అంశాలపై చర్చించిన అర్జున్…
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం విశాఖపట్నం విచ్చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం సిటిజన్స్ తరపున సోషల్ మీడియా కన్వినర్ సీనియర్ జర్నలిస్టు పైల అర్జునరావు మంత్రి తో భేటి అయ్యారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన ఈ భేటి లో వివిధ అంశాలను అర్జునరావు ప్రస్తావించారు. దీర్ఘంగా జరిగిన ఈ చర్చలో మంత్రి తో పైల అర్జున రావు పలు అంశాలు ప్రస్తావించారు. ఈ భేటి లో పైల అర్జునరావు తో పాటు బిజెపి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులు నాయుడు, బీజేపీ ఓబీసీ నాయకులు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.