గుంటూరు (అక్షర ప్రళయం)
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నీతి, నిజాయితీతో వైద్యులను కలుపుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి అభివృద్ది కోసం కృషిచేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలు అందరికీ తెలిసేలా సుఖీభవ ఛార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.