(అక్షర ప్రళయం)
32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయాలని నిర్ణయించింది. ఏపీ సీఆర్డీఏలో ఏడుగురికి పోస్టింగ్ ఇస్తూ సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రొటోకాల్ డైరెక్టర్‌గా టి.మోహన్‌రావు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పి.రచన, శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా టి.బాపిరెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.