అరిలోవ (అక్షర ప్రళయం)
కుటుంబ మనస్పర్థలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన ఇద్దరు యువతుల ఆచూకీ గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించిన నగర పోలీసులు. వేర్వేరు సంఘటనలలో ఇద్దరు యువతులు తమ తమ కుటుంబ సభ్యులతో మనస్పర్థలు కారణముగా అలిగి ఇంటి నుండి వెళ్లిపోగా, అరిలోవ పోలీసు స్టేషన్ నందు రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసి, తక్షణం వారి ఆచూకీ కోసం విచారణ జరిపి అతి తక్కువ సమయంలో ఒక యువతిని మచిలీ పట్నం వద్ద, మరో యువతిని నగర శివార్లలో గుర్తించి, వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగినది .ఇంటి నుండి వెళ్లిపోయిన తమ కుమార్తెలను తిరిగి భధ్రముగా అప్పగించిన విశాఖ నగర పోలీసులకు సదరు యువతుల తల్లి దండ్రులు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు తక్కువ సమయంలో యువతుల ఆచూకీ గుర్తించి, వారి తల్లిదండ్రులకు అప్పగించిన సిబ్బందిని అభినందించారు.