5గురు నిందితులు..
ముగ్గురు పట్టివేత…
ఇద్దరు పరారి..
5గురిలో ఒకరు మైనర్..
విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
శుక్రవారం సాయంత్రం సమయంలో 1టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ జి.డి.బాబు కి పక్కా సమాచారం రావడంతో విశాఖ సిటి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కి వచ్చే కోడిపందాల వీధి వెనుక, కె.జి.హెచ్ లేడీస్ హాస్టల్..! దగ్గరలో వున్న ఖాళీ ప్రదేశంలో కొండ పైన వెళ్ళగా, అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా వుండగా వారిని పట్టుకొని ఆరతీయగా, వారి వద్ద 02 కె.జి ల గంజాయిని, మరియు ఇంకా ఆరాతీయగా రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాము అని తెలపగా, అవి ఎక్కడ వున్నాయి అని ఆడగగా, కొంతదూరంలో వాటిని చూపించగా, మద్యవర్తులు సమక్షం లో వాటిని స్వాదిన పరుచుకొని, సిబ్బంది సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడమైనది. ఇంకా ఇద్దరు వ్యక్తులు పరారీలో వున్నారు. పట్టుబడ్డ వారిలో ఒకరు మైనర్! వారిని విచారించగా మరో ఇద్దరు నిందితులతో కలిసి రెండు గంజాయి మొక్కలను వారు సేవించుటకు పెంచుతున్నట్లు తెలియపరిచినారు. గతములో ఏజెన్సీ కి వెళ్ళి తెచ్చుకునే వారిమనీ కాని, ఇటువల పోలీస్ వారి చెకింగ్ లు ఎక్కువ చేస్తున్నారు అని అంధువల్ల దొరుకుపోతాం అని బావించి, మేము అంధరము కలిసి అక్కడ రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు తెలియపరిచినారు. నిందితులను రిమాండ్ కు తరలించడం జరుగుతుంది అని తెలిపారు.