విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ గా ప్రణవ్ గోపాల్ నియమితులైన సందర్భంగా దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ని శివాజీపాలెం క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూటమి అధికారం లోకి రావడానికి కృషి చేసిన ప్రణవ్ కి శాలువా వేసి శుభాకాంక్షలు తెలియజేశారు .కార్యక్రమంలో జనసేన నేత డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
టీటీడీ కళ్యాణ మండపంలో కళింగ కోమటి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రత మహోత్సవ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామి వారి పూజ లో పాల్గొని , తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.అనంతరం శివాజీపాలెం క్యాంప్ కార్యాలయంలో పలు వినతులు మరియు ఆహ్వాన పత్రికలను స్వీకరించారు.