విశాఖపట్నం (అక్షర ప్రళయం)
గ్లోబుల్ వరల్డ్ రికార్డ్ యోగాసనా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ కార్యక్రమం నేచర్ క్యూర్ హాస్పిటల్ మహారాణిపేట ఆవరణలో ఆదివారం వర్చువల్ పద్ధతిలో బెంగుళూరు గ్లోబల్ వరల్డ్ రికార్డ్ సంస్థ వారి సహకారంతో జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగ పరిషత్ ఉపాధ్యక్షుడు కేఏ రాజు 29వ వార్డు కార్పొరేటర్ ఊటుకూరి నారాయణరావు డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రమేష్, హనుమంతరావు అధిక సంఖ్యలో యోగా శిక్షకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా బుద్ధ భగవానుడికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాజు ప్రసంగిస్తూ డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి యోగ సాధకురాలుగా ప్రకృతి చికిత్స ఆలయం అధినేతగా అనేక సంవత్సరాలుగా విశాఖ ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఈ వరల్డ్ రికార్డ్ ! కార్యక్రమంలో ఎస్ శ్రీలక్ష్మి పద్మాసము భంగిమ లో, ఎం దుర్గా మాధవి సుప్త విరాసనం భంగిమలో, వరలక్ష్మి గర్భాశనము భంగిమలు, కృష్ణకుమారి భుజంగాసన భంగిమలు, మాధవి గారు జి రమణమూర్తి పద్మాసనము భంగిమలు ఉదయము 10 గంటల సమయం నుంచి 11 గంటల 8 నిమిషాలు సమయం వరకు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని యోగా సాధకులురమేష్ పర్యవేక్షణలో జరిగినది కార్యక్రమం అనంతరం వార్డు కార్పొరేటర్ ప్రజా ప్రతినిధి ఉరుకూటి నారాయణరావు విజేతలకు గ్లోబుల్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో యోగా సాధకులు పాల్గొని విజయవంతం చేశార. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ ఎస్ మహేష్, ఎస్ ఛాతుర్య, ఏ మల్లికార్జున, క్షీరాబ్దిదుతి పల్లా చలపతిరావు, దేవర చంద్రశేఖర్,తలాడ గిరిజ, డివిఆర్ ప్రసాద్ అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.