- మిథలాజికల్ థ్రిల్లర్ సినిమా
- నవంబర్ 22న విడుదల
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
దేవకి నందన వాసుదేవ సినిమా బృందం విశాఖలో గురువారం సందడి చేసింది. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు *గల్లా అశోక్ హీరోగా,మానస వారణాసి హీరోయిన్ గా,అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలక్రిష్ణ నిర్మిస్తున్న దేవకి నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గురువారం హోటల్ దశపల్ల లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ, మంచి కమర్షియల్ సినిమా కు వినోదం మేళవించడం జరిగిందన్నారు.
ఈ సినిమాకి హనుమాన్ దర్శకుడు ప్రశాంత వర్మ కథ అందించారని తెలిపారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునే మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అని పేర్కొన్నారు. ఈ చిత్రం ట్రైలర్, టీజర్ లకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ సినిమా చేయాలని వుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సినిమాలో మ్యూజిక్ బాగా వచ్చిందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా వచ్చిందని వెల్లడించారు. మంచి చేయాలకునే వారికి ఎప్పుడూ దేవుడు వెంటే ఉంటారని, సాయం చేసే వారే దేవుడనే కాన్సెప్ట్ తో ఈ సినిమా చేయడం జరిగిందన్నారు. దేవదర్శి ఇందులో విలన్ పాత్రలో బాగా చేశారని చెప్పారు.డైరెక్టర్ అర్జున్ జంధ్యాల ఈ సినిమాను చాల అద్భుతంగా తెర కేక్కించారు అన్నారు. నిర్మాత బాల కృష్ణ మాట్లాడుతూ, మాట్లాడుతూ బోయ పాటి శ్రీనివాస్ వద్ద తాను దర్శక విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి ఈ సినిమా తీశామని అన్నారు.తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని తెలిపారు.హీరోయిన్ మానస వారణాసిమాట్లాడుతూ, మోడలింగ్ నుంచి తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారు.తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను హైదారాబాద్ లో పుట్టిన తెలుగు అమ్మాయిని అన్నారు. తాను మిస్ వరల్డ్ పోటీల్లో టాప్ – 10 లో ఓకరిగా నిలిచాను అని గుర్తు చేశారు. ఇందులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాను అన్నారు.