మధురవాడ (అక్షర ప్రళయం) నవంబర్ 14:
గత నెల ఆరవ తారీఖున పీఎం పాలెం ఆర్.ఎచ్. కాలనీలో జరిగిన భారీ దొంగతనములో ముగ్గురు నిందితులని గుర్తించి పూర్తి చోరీ సొత్తు స్వాధీనం చేసుకొని నిందితులను పీఎం పాలెం క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.మధురవాడ క్రైమ్ స్టేషన్లో దీనిపై గురువారం విలేఖరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఏ వెంకటరావు వివరాలు వెల్లడించారు.గత నెల అక్టోబర్ ఆరవ తేదీన పీఎం పాలెం నివాసి కే.ధనుంజయరావు తన భార్య ఆరోగ్య నిమిత్తం హాస్పిటల్ కు , వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసారని.పోయిన సొత్తు సుమారుగా 20 తులాల బంగారం, 20 తులాల వెండి చోరి జరిగినట్లు చెప్పారని అన్నారు. పోలీస్ కమీషనర్ శంకబ్రత భాగ్చి ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ ఏ లలితమాధురి ఆధ్వర్యంలో వివిధ బృందాలుగా ఏర్పడి నిందుతులను పట్టుకోవటం జరిగింది అని అన్నారు. ఈ నేరం లో ముగ్గురు నిందితుల ప్రమేయం ఉందని, అందులో ఒకరుని ఇప్పటికే అరస్ట్ చేసామని, ఇంకో నేరస్తుడు బాలుడు, జూవిలియన్ హోమ్ లో పలుసార్లు వుండి వచ్చాడని. వీరిపై కూడా పలు స్టేషన్లో కేసులు నమోదు అయ్యున్నాయని చెప్పారు.
ఇందులో సూత్రధారి, ప్రధాన నిందితుడు గర్భాన ఆనందరాజు కి ఇంతకుముందు తీవ్ర నేరాలతో జైలులో ఉండటం తో బెయిల్ మీద వచ్చిన వెంటనే అరస్ట్ చేయటం జరిగింది అని చెప్పారు.విజయనగరం పరిసర ప్రాంతాలనుండి చోరీ సొత్తు స్వాధీన పరచుకొని ప్రధాన ముద్దాయిని అరస్ట్ చేసి రిమాండుకు తరలించటం జరిగింది అని చెప్పారు.
ఈ ప్రెస్ మీట్ లో మధురవాడ క్రైమ్ సీ.ఐ. బి.ఎస్.ఎస్. ప్రకాష్,క్రైమ్ ఎస్.ఐ. ఆర్ శ్రీనివాసరావు హాజరయ్యారు.