విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
ఇసుక కొండ బాబాజీ కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుక మంగళ ధ్వని వేద మంత్రములతో అంగరంగ వైభవంగా జరిగింది . శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ అర్చకులు ఫణిహారం నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు , అర్చనలు , కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు . ఇటు ఘాట్ రోడ్ నుండి అటు కేజీహెచ్ నుండి వేలాది సంఖ్యలో భక్తుల తరలివచ్చి క్యూ లైన్ల ద్వారా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి అనంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు . వెయ్యి మందికి పైగా దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు . వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీమన్నారాయణ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది . భక్తులు పూర్ణ మార్కెట్ మీదగా నూతనంగా నిర్మించిన ఘాట్ రోడ్ ద్వారా అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడం విశేషం.