మధురవాడ (అక్షరప్రాళయం)
గల మాలతాంబ విద్యానికేతన్ పాఠశాల ఆధ్వర్యంలో వార్షికోత్సవాల సందర్భంగా క్రీడలు నిర్వహించారు. జరిగాయి. సాంకేతిక కళాశాల మైదానంలో గత రెండు రోజుల పాటు జరిగిన మాలతాంబ వార్షిక క్రీడలు శుక్రవారం క్రీడా స్ఫూర్తిని చాటుతూ ముగిశాయి. సుమారు 300మంది క్రీడాకారులు పాల్గొని… రన్నింగ్, క్రికెట్, త్రోబాల్, షాట్ పుట్, కోకో, రిలే పరుగుల పోటీ, పిరమిడ్స్, యోగ ఆసనాలు, కరాటే, టైక్వాండో మార్షల్ ఆర్ట్స్, యుద్ధ కళలు, కల్చరల్ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మాలతాంబా విద్యాసంస్థల అధినేత ఎన్.ఐ.ఎఫ్.ఎస్.( సీఈఓ), జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుసునీల్ మహంతి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాన్ గేలియాట్. డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎన్.సాయి సిఐ. నార్త్ జోన్ ట్రాఫిక్. జి.ప్రసాద్ సబ్-ఇన్స్పెక్టర్ పీ.ఎం.పాలెం ట్రాఫిక్ పిఎస్.పాల్గొని విజేతలకు ట్రోఫీ, మెమొంటాలను అందించారు. కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. క్రీడల వలన రాష్ట్రస్థాయి జాతీయస్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేశాల బాల్యం ఉండాలన్నారు. విద్యార్థులు దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.ప్రతి విద్యార్థి క్రీడలతో పాటు ఉన్నత చదువులు చదివి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈకార్యక్రమంలో జనరల్ మేనేజర్ డాక్టర్. జి.పి.ఆర్. కృష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ ఏ.ఆదిమూర్తి, వైస్-ప్రిన్సిపాల్ బి. శ్రీదేవి, ఫిజికల్ డైరెక్టర్ బి. హరీష్, పాఠశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.