అటవీశాఖకు చిక్కిన నాల్గు బొమ్మలు..
చెన్నై సెంట్రల్ డెస్క్(అక్షర ప్రళయం)
ఏనుగు దంతాలతో చేసిన విలువైన ఏనుగు ప్రతిమలను అటవీశాఖ అదికార్లు ఫట్టుకున్నారు.చెన్నై నగరం లో స్మగ్లింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనలో సుమారు 7 కోట్లు పైగా విలువ చేసే ఏనుగు దంతాలతో తయారు చేసిన 4 ఏనుగు బొమ్మలను చెన్నైఅటవీశాఖ అదికారులు స్వాదినం చేసుకున్నారు.
నగరంలోని విల్లుపురం కొత్త బస్ స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో స్మగ్లర్లు ఏనుగు బొమ్మలను సంబంధించి విక్రయిస్తుండగా అటవీశాఖ అధికారులు, విల్లుపురం పోలిసు అధికారులు అరెస్టు చేసారు. ఈ ఘటనలో చెన్నై, తిరుచ్చి, తంజావూరు, దిండిగల్, ధర్మపురి జిల్లాలకు చెందిన 12 మంది స్మగ్లర్లు అరెస్టు అయినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో భాగంగా గత కోంత కాలంగా పెద్ద సంఖ్యలో ఎనుగులు బొమ్మలను పెద్ద ఎత్తున సంపన్న కుటుంబాలకు తిరుచ్చికి చెందిన ముఠా విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఏనుగులను చంపి వాటి దంతాలతో బొమ్మలను చేసి విక్రయిస్తోంది సదరు ముఠా. దీని వెనుక అతి పెద్ద స్మగ్లర్లు ఉన్నట్లు గుర్తించారు పోలిసులు. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అక్రమార్కులను కనిపెడ్తామని అధికారులు అన్నారు..