ఒక్కో గాడిద1.5 లక్షలకు కట్టబెట్టిన చెన్నై డాంకీ ప్యాలెస్.
లీటర్ గాడిదపాలు వెయ్యికి కొంటాం ‘డాంకీ ప్యాలెస్’
సెంట్రల్ డెస్క్(అక్షర ప్రళయం)
గాడిద గుడ్డు అన్న సామేత వింటునే ఉంటాం.గాడిద గుడ్డు పెట్టడం ఏమో గాని! చెన్నైకి చెందిన ఓ సంస్థ ఆ గాడిద పాలను షాక్ చూపించి ఏపీ తెలంగాణా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో వంద కోట్లకు రైతుల నెత్తిన శఠగోపం పెట్టింది.ఇచ్చిన చెక్కులు చెల్లక పోవడంతో బాధితులు లబోదిబో మంటు రోడ్డెక్కడంతో నాలుగు రాష్ట్రాల్లోగాడిద పాలు ఉత్పత్తి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగు చూసింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ తెలంగాణ, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల రైతులను మోసం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో రూ.100 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. గాడిద పాల ఉత్పత్తి పేరుతో మోసపోయిన రైతులు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు.
“డాంకీ ప్యాలెస్” అనే చెన్నై సంస్థ
గాడిద పాలు లీటరు వెయ్యి రూపాయలకు కొనుగోలు చేస్తాం అని నమ్మించి రైతులకు గాడిదలను పంపిణీ చేశారు.ఆయితే ఒక్కో గాడిదను 80 వేలు నుంచి లక్ష ఎబై వేల వరకు తమకు విక్రయించిందని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. లీటర్ పాలు వెయ్యి రూపాయలు నుండి 1600కు చెల్లించేందు కు ఒప్పందం చేసుకుని మూడు నెలల పాటు గాడిద పాలను కొనుగోలు చేసింది. అయితే గత 18 నెలలుగా గాడిద పాలకు డబ్బులు ఇవ్వడం లేదని వారు వాపోయారు.”డాంకీ ప్యాలెస్” సంస్థ తమకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు తమకు న్యాయం చేయాలని బాధితులు మొర పెట్టుకున్నారు.గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు అనే బాధితుడు మాట్లాడుతూ ‘డాంకీ ప్యాలెస్’ గురించి చెబితే తాను రూ.56 లక్షలు ఇన్వెస్ట్ చేశానని తమకు మూడు నెలల పాటు డబ్బులు ఇచ్చారని, కానీ ఆ తర్వాత నుంచి ఇవ్వలేదన్నారు. తమ ఆందోళనపై ఏపీ మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. తెలంగాణ నుంచి కేటీఆర్ ఈ ఘటనపై స్పందించారని తెలిపారు.