కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ప్రకాశం జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా, దర్శి (అక్షర ప్రళయం)

ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగలను దొంగతనం చేయడం గంజాయి అమ్మడం చేస్తున్న కొందరు వ్యక్తులను ప్రకాశం జిల్లా పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో తరచూ జరుగుతున్న ట్రాన్స్ ఫార్మర్ లను పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగతనం చేస్తున్న దొంగలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశించటంతో. వారి ఉత్తర్వుల మేరకు దర్శి డి.ఎస్. పి బి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తుండగా శుక్రవారం త్రిపురంతకం సీ.ఐ అస్సన్ వారి సిబ్బందితో కురిచేడు సమీపంలో ఈరోజు ఉదయం 11:30 గంటలకు కురిచేడు రైల్వేస్టేషన్ సమీపంలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా. వారి వద్ద సుమారు 1.5 కేజీల గంజాయిని. స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో విచారించగా. వారు తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, కుడిచేడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ లను పగలగొట్టి అందులోని రాగి తీగను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. ఆరు కేసులకు సంబంధించి సుమారు 16 కేజీల రాగి తీగను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో పోలా జాన్సన్ గతంలో 13 ట్రాన్స్ ఫార్మర్ ల దొంగతనంలోముద్దాయిగా ఉండి.. తప్పించుకునితిరుగుతున్నాడు. పోలా జాన్సన్ , కుంచాల లింగేష్ , వారి స్నేహితులు జల్సాలకు జూదాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించటానికి దొంగతనాలను ఎంచుకున్నారు. వీరందరూ గతములో ప్రకాశం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ లను దొంగిలించి అందులోని రాగి తీగను అమ్ముకున్నారు. వారు దొంగలించిన రాగి తీగను గురున్నాథం, లాజర్ కు అమ్మేవారు. ఈ ముగ్గురు ముద్దాయిలు బాగా స్నేహంగా కలసి తిరుగుతుంటారు. అందువలన పోలా జాన్సన్ మిగతా ఇద్దరితో కలిసి వినుకొండ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొని. దానిని దర్శి ఏరియాలో అమ్ముకోవడానికి కురిచేడు రైల్వే స్టేషన్ నుండి ఊర్లోకి వస్తుండగా, సమాచారులను ఏర్పరచుకొని త్రిపురాంతకం సిఐ అస్సన్ చాకచక్యంగా వారిని పట్టుకుని , వారి వద్ద నుండి సుమారు 1.5 kg ల గంజాయిని, సుమారు 16 కె.జి ల రాగి తీగను స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, మాట్లాడుతూ. త్రిపురాంతకం సి.ఐ అసన్, తాళ్లూరు ఎస్. ఐ మల్లికార్జున, ఏ.ఎస్.ఐ మోహన్ రావు , హెడ్ కానిస్టేబుల్ విగ్నేష్ , కానిస్టేబుల్ నారాయణరెడ్డి లను అభినందించారు. ఈ కార్యక్రమంలో దర్శి డి.ఎస్.పి లక్ష్మీనారాయణ, దర్శి సి.ఐ రామారావు , సి.ఐ అస్సాన్ , ఎస్. ఐ లు మురళి, మల్లికార్జున, కొంతమంది సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *