విశాఖపట్నం (అక్షర ప్రళయం)
గుంటూరు జిల్లా సత్తెనపల్లి పలనాడు ప్రగతి జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ నెల 8వ తేదీ నుండి 10 వ తేదీ వరకు జరిగిన 68వ అండర్ 19 ఫుట్ బాల్ స్కూల్ గేమ్స్ నిర్వహించబడ్డాయి.ఈ ఫుట్ బాల్ ఆటలలో విశాఖపట్నం పాల్గొనగా.. రెండవ స్థానంలో నిలిచిన విశాఖపట్నం ఫుట్ బాల్ జట్టు. ఈ యొక్క ఫుట్ బాల్ టీమ్ నకు కోచ్ గా (ఏవిఎన్ కాలేజ్) పి.డి అయినటువంటి ఎస్.గోపికృష్ణ వ్యవహరించారు. ఈ సందర్బంగా గోపి ఏవిన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గోపి కృష్ణను కొనియాడారు.ఈ యొక్క స్కూల్ గేమ్స్ లో పాల్గొని రెండవ స్థానంలో నిలిచిన ఈ టీం లో ఉన్న నలుగురు విద్యార్థులను డిసెంబర్ మొదటి వారంలో(మణిపూర్/ఇంఫాల్) లో జరగబోయే అండర్ 19 ఫుట్ బాల్ నేషనల్స్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొంటున్నారు. 1.సి.హెచ్.వి దుర్గా ప్రసాద్(మిస్సెస్. ఎ.వి.ఎన్ కాలేజ్), 2.వి సర్వంత్( డాక్టర్.లంకపల్లి బుల్లయ్య కాలేజ్), బి.మన్యుష్ సాయ్ చంద్ర (యు.ఎన్.అకాడమీ) సి.హెచ్.సందీప్(జడ్.పి. హై.స్కూల్) నుండి ఈ నలుగురు విద్యార్థులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్బంగా టోర్నమెంట్ కు ఎంపికైన నాలుగు విద్యార్థుల కాలేజ్ ప్రిన్సిపాల్ లు, కాలేజ్ సిబ్బంది, తోటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.