మంత్రి నారాయణ
అమరావతి (అక్షర ప్రళయం)
ఏపీలో భవననిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలో కొత్త విధానం తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన డిసెంబర్15 నాటికి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నా మన్నారు. ప్రజలు తమ పెండింగ్ పన్నులను వెంటనే చెల్లించాలని కోరారు.